గుండెపోటుతో ప్రముఖ కవి నిజాం వెంకటేశం మృతి

గుండెపోటుతో ప్రముఖ కవి నిజాం వెంకటేశం మృతి

పద్మారావునగర్​, వెలుగు:  ప్రముఖ కవి నిజాం వెంకటేశం (74) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఏడీఈగా ఉద్యోగ విరమణ చేశారు. 5 దశాబ్దాల పాటు తెలంగాణ సాహిత్యాభివృద్ధికి సేవలందించారు. 
జగిత్యాలలో ఉన్నప్పుడు ‘దిక్సూచి’ అనే కవితా పత్రికను ప్రారంభించి,

ఎంతో మంది కవులకు దారి చూపారు. తెలుగు, ఇంగ్లీష్​ భాషల్లో ఎన్నో కవితా సంకలనాలను, పుస్తకాలను అనువదించారు. అల్లం రాజయ్య కథల సంకలనం ‘భూమి’ని వెంకటేశం ప్రింట్​ చేశారు. 80వ దశకంలో తెలంగాణ కవిత్వానికి చిరునామాగా నిలిచారు. అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ లాంటి ఎంతో మంది కవులకు ఆయన స్ఫూర్తి. పోయిన నెల 31న వెంకటేశం తల్లి సత్తమ్మ చనిపోగా, కొద్ది రోజుల వ్యవధిలో కుమారుడు వెంకటేశం గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.