Virat Kohli 71st century: కోహ్లీ సెంచరీ.. పెళ్లి చేసుకున్న అభిమాని

Virat Kohli 71st century: కోహ్లీ సెంచరీ.. పెళ్లి చేసుకున్న అభిమాని

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 71 సెంచరీ కోసం ప్రపంచం ఎంతలా ఎదురుచూసిందో అందరికీ తెలుసు. సెంచరీ చేయాలని కొందరు ఫ్యాన్స్ పూజలు చేస్తే, మరికొందరు సెంచరీ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోమని కంకణం కట్టుకున్నారు. అలా.. గతేడాది ఏప్రిల్ లో అమన్ అగర్వాల్ అనే కోహ్లీ వీరాభిమాని ‘విరాట్ 71వ సెంచరీ చేసేవరకు పెళ్లి చేసుకోన’ని ప్రామిస్ చేసి ప్లకార్డ్స్ తో మ్యాచ్ కి హాజరయ్యాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ప్రామిస్ ని నిలబెట్టుకున్న అమన్ కోహ్లీ 74వ సెంచరీ సందర్భంగా పెళ్లి పీటలెక్కాడు.

ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న కోహ్లీ 4 సెంచరీలు చేశాడు. ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ తో మొదలుపెట్టి, అదే ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. శ్రీలంకపై కోహ్లీ సెంచరీ చేసిన రోజే అమన్ పెళ్లి చేసుకున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘నేను 71వ సెంచరీ అడిగితే.. బహుమతిగా 74 సెంచరీలు చేశాడ’ని రాసుకొచ్చాడు. దీంతో ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా.. ‘నిజమైన అభిమానంటే నువ్వేరా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వార్తలు