షారుఖ్ ఫొటో కోసం ఫ్యాన్ ప్రయత్నం... అంతలోనే...

షారుఖ్ ఫొటో కోసం ఫ్యాన్ ప్రయత్నం... అంతలోనే...

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన కొడుకు మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్ తో ఓ ఫ్యాన్ ఫొటో దిగేందుకు ప్రయత్నించి.. చేయి లాగబోతుండగా ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ అడ్డుకున్నారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. ఎయిర్ పోర్ట్ నుంచి షారుఖ్ ఖాన్ తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్లు బయటకు వస్తోన్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దాంతో అభిమానులు.... ఆసక్తిగా వారిని చూస్తుండిపోయారు. అయితే ఆ అభిమానుల్లో ఒకరు.. షారుఖ్ ఖాన్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా షారుఖ్ చేతిని పట్టుకొని లాగబోయాడు. ఇంతలో వెనకే వస్తోన్న కొడుకు ఆర్యన్ .. అతన్ని అడ్డుకొని.. షారుఖ్ ను తీసుకొని వెళ్లిపోయారు. ఈ సందర్భంలో షారుఖ్.. ఆ అభిమానిపై కోపంగా ఉన్నట్టు కనిపించాడు. అంతలోనే ఆర్యన్ కలగజేసుకొని షారుఖ్ ని శాంతింపజేస్తాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇన్వాల్వ్ అయి ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది.  ఈ నేపథ్యంలోనే ఆర్యన్.. కొన్ని రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించి.. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చారు. అయితే ఎన్సీబీ నుండి క్లీన్ చిట్ పొందిన ఆర్యన్... ఇటీవలే మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక (ఎన్‌డిపిఎస్) NDPS కోర్టులో పిటిషన్ వేశాడు.  దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.