పీలే కడచూపు కోసం పోటెత్తిన ఫ్యాన్స్​, ప్రముఖులు

 పీలే కడచూపు కోసం పోటెత్తిన ఫ్యాన్స్​, ప్రముఖులు

శాంటోస్​ (బ్రెజిల్​): సాకర్​ లెజెండ్​ పీలే కడచూపు కోసం ఫ్యాన్స్​, ప్రముఖులు పోటెత్తారు. సోమవారం పీలే భౌతిక కాయాన్ని ప్రజల  సందర్శనార్థం శాంటోస్​లోని  ‘విలా బెల్మెరో స్టేడియం’ మిడ్​ ఫీల్డ్​లో ఉంచారు. 24 గంటల పాటు పబ్లిక్​ చూసేందుకు అనుమతించారు. దాంతో పీలేను చివరి సారి చూసేందుకు ఉదయం​నుంచే బారులు తీరారు.  ఫిఫా ప్రెసిడెంట్​ గియాని ఇన్​ఫాంటినో, బ్రెజిలియన్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గిల్మార్​ మెండిస్​ కూడా పీలేకు నివాళి అర్పించారు.

మంగళవారం పీలే కాఫిన్​ (శవ పేటిక)ను శాంటోస్​ వీధుల గుండా ఊరేగించనున్నారు. పీలే తల్లి సెలెస్టీ  ఇంటి ముందు నుంచి ఈ యాత్ర సాగనుంది.  బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్థానికటైమ్​ ప్రకారం ఉదయం 10 గంటలకు ‘మెమోరియల్​ నెక్రోపోల్​ ఎక్కుమెనికా’లో పీలే భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు.