
ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు (Mahesh Babu).. తన తర్వాతి సినిమా రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్‌కు వావ్ అనిపించే స్టిల్ ఒకటి అట్ట్రాక్ట్ చేస్తోంది.
ఎప్పుడు యవ్వనంగా కనిపించే మహేష్ బాబు మరో సారి తన లుక్ తో పిచ్చెక్కించేస్తున్నాడు. లాంగ్ హెయిర్ తో,కళ్లద్దాలు,టోపీ ధరించి ఉన్న రగ్గుడ్ లుక్ పిక్ ఒకటి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
అయితే వివరాల్లోకి వెళితే..మహేష్ బాబు,డైరెక్టర్ రాజమౌళి కలిసి SSMB29 సినిమా కోసం దుబాయ్‌లో సిట్టింగ్స్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ దుబాయ్ నుంచి హైద్రాబాద్‌కు ఎయిర్ పోర్ట్ లో రావడం గమనించిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. దీంతో ఫొటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త లుక్ తో ప్రిన్స్ ఖతర్నాక్ ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Superstar @urstrulyMahesh back home ♥️
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) April 19, 2024
#MaheshBabu was papped along with @ssrajamouli and KL Narayana at the airport ? #SSMB29 #MBSSR
pic.twitter.com/w9Jt0d0VTx
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ త్వరలో షూటింగ్ షురూ చేయనుంది.అందుకు తగ్గ లొకేషన్స్ ను కూడా జక్కన్న ఫిక్స్ చేశారని తెలుస్తుంది.ఈ సినిమాను రాజమౌళి ఒక ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నారు.కాగా..ఇందులో మహేష్ క్యారెక్టర్‌కు హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని, అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటాడని తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉంటారు.
#MaheshBabu Latest Look ❤️?#SSMB29 #MaheshBabu#SSRajamouli #SSMB29 pic.twitter.com/Q11BGAMWmu
— BOND OO7 (@BOND420OO7) April 19, 2024