ర‌జ‌నీని సూప‌ర్‌స్టార్ అని పిల‌వ‌నందుకు హీరోపై ఫ్యాన్స్ ఫైర్

ర‌జ‌నీని సూప‌ర్‌స్టార్ అని పిల‌వ‌నందుకు హీరోపై ఫ్యాన్స్ ఫైర్

త‌మిళ యువ‌హీరో విష్ణు విశాల్ టాలీవుడ్కి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హీరో. రానాతో క‌లిసి అర‌ణ్య‌ మూవీలో నటించిన ఈ యంగ్ హీరో.. తెలుగు ఆడియాన్స్ కు దగ్గరయ్యాడు. ఇక రీసెంట్ గా ‘మట్టికుస్తీ’అనే సినిమాతో మరోసారి తెలుగు లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ మూవీని రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. 

లేటెస్ట్ గా విష్ణు విశాల్..చేసిన పోస్ట్ పై..రజినీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. కమల్ హాసన్, -అమీర్ ఖాన్‌లకు సూపర్ స్టార్ టైటిల్‌ను ట్యాగ్ చేయడం వల్ల..రజనీకాంత్ ఫ్యాన్స్ మనస్తాపం చెందారు. దీంతో విష్ణు విశాల్‌ను ట్రోల్ చేసి, సూపర్ స్టార్ అంటే..ఒక్కరే ఉంటారని, అది తమిళ ఇండస్ట్రీకి..రజనీకాంత్ మాత్రమే అని విరుచుకుపడ్డారు. ఆ త‌ర్వాత వెంటనే విష్ణు త‌న‌ క్యాప్షన్‌ను మార్చారు. 

ఇదే విషయంపై విష్ణు విశాల్..తన ట్వీట్ ని వివరిస్తూ..తాజాగా ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. 'సూపర్ స్టార్‌లు ఒక కారణం కోసం సూపర్ స్టార్‌లు... నేను నా ట్వీట్‌ను ఎడిట్ చేసినంత మాత్రాన నన్ను బలహీనపరచదు.. నేను సూపర్‌స్టార్ అయిన ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాను..కాబట్టి మీరందరూ నా టైమ్‌లైన్‌లో ప్రతికూలతను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు..మాకు ఒకే ఒక్క సూపర్‌స్టార్ బిరుదు ఉంటుంది..కానీ స్టార్ డ‌మ్ సాధించిన ప్రతి ఒక్కరూ సూపర్ స్టార్‌లు. అందరినీ ప్రేమించండి.. ప్రేమను పంచండి. ద్వేషం కాదు. గాడ్ బ్లెస్' అని లేటెస్ట్ పోస్ట్ ద్వారా వివరించారు.

ప్రస్తుతం విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న లాల్ సలామ్ మూవీలో రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.