సంజూ శాంసన్ తండ్రి కాబోతున్నాడా..!

సంజూ శాంసన్ తండ్రి కాబోతున్నాడా..!

భారత జట్టు యువ వికెట్ కీపర్..సంజూ శాంసన్కు ప్రమోషన్ లభించనుందా..? అతను త్వరలో తండ్రి కాబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి కారణం కూడా లేకపోలేదు. క్రిస్మస్ సందర్భంగా సంజూ పోస్ట్ చేసిన ఫోటోలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 

క్రిస్మస్ సందర్భంగా సంజూ శాంసన్ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపాడు. సతీమణి చారులతతో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో సంజూ, చారులత పోజులు, ఫోటోలకు పెట్టిన క్యాప్షన్తో  అభిమానులు గుర్తు పెట్టేశారు. వీటిని చూసిన ఫ్యాన్స్..త్వరలో సంజూ తండ్రి అవ్వబోతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. 

క్రిస్మస్ సందర్భంగా  తన ఇంట్లో అలంకరించిన క్రిస్మస్ ట్రీ దగ్గర సంజూ శాంసన్ తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు. దీనికి తాము ఇప్పటికే పొందిన ఆశీర్వాదాలను గుర్తించడమే ఫెస్టివల్ కు అందుకున్న బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాడు. దీనికి తోడు సంజూ వైఫ్  చారులత  పెట్టిన ఫొటోలో పోజు కూడా అభిప్రాయానికి కారణమైంది. ఇద్దరు నిలబడిన తీరుతో ఫ్యాన్స్ కన్ఫార్మ్ చేసుకున్నారు.  దీంతో సంజూ తండ్రి కాబోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై సంజూ శాంసన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.