అంబేద్కర్ కాలేజీలో ఫేర్వెల్ వేడుకలు

అంబేద్కర్ కాలేజీలో ఫేర్వెల్ వేడుకలు

ముషీరాబాద్, వెలుగు: బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో ఫేర్​వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం కాలేజీ ఆవరణలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు తమ సీనియర్స్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. 

బెల్లంపల్లి ఎమ్మెల్యే, కాలేజీ సెక్రటరీ డాక్టర్ జి.వినోద్, సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి హాజరై విద్యార్థులకు మోటివేషన్ ఇచ్చారు. ఎంబీఏలో నేర్చుకున్న నైపుణ్యాలను ఎలా వృత్తి జీవనంలో ప్రయోజనకరంగా మార్చుకోవాలో సూచించారు. అనంతరం జూనియర్ విద్యార్థులు డ్యాన్స్, స్కిట్లతో అలరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి అంజన్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.