
- హాజరైన పీఎం మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ: ఇవాళ రాజ్యసభలో రిటైర్ అవుతున్న 72 మంది సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. అంతకుముందు జరిగిన ఫోటో సెషన్ లో ప్రధాని మోడీ, రాజ్యసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పదవీ విరమణ చేయనున్న సభ్యులు ఫోటోలు దిగారు. ఇక ఈ రోజు రిటైర్ అవుతున్న సభ్యులు పెద్దల సభలో చివరిసారిగా ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ను చైర్మన్ రద్దు చేశారు. దీంతో రోజంతా సభ్యుల ప్రసంగాలు కొనసాగనున్నాయి. అలాగే ఇవాళ సాయంత్రం వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు నివాసంలో పదవీ విరమణ చేయనున్న సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్నా వారిలో.. సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మికాంతరావు ఉన్నారు.