ఫర్హానా...ఆ వ్యక్తి ఎవరు?

 ఫర్హానా...ఆ వ్యక్తి ఎవరు?

ఇస్లాం కట్టుబాట్లను, సంప్రదాయాలను పాటించే ముస్లిం కుటుంబం ఫర్హానా (ఐశ్వర్య రాజేశ్)ది. ఆమె భర్త చెప్పుల షాపు నడుపుతుంటాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. కానీ, వాళ్ల బాగోగులు చూసుకునే స్థోమత ఉండదు. అలాంటి పరిస్థితుల్లో సంప్రదాయాలను, కట్టుబాట్లను ఎదిరించి ఉద్యోగం చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది ఫర్హానా.  భర్త సపోర్ట్​ చేయడంతో ఒక కాల్ సెంటర్ ‌లో ఉద్యోగానికి వెళ్తుంది. డబ్బులు సంపాదించేందుకు ఎంత రిస్క్​ అయినా చేసేందుకు వెనుకాడదు. కాల్​సెంటర్​లో ఉద్యోగం చేస్తున్న ఫర్హానా జీవితంలోకి ఒక వ్యక్తి  వస్తాడు. ఫోన్​లో ఫర్హానాను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. అతడెవరు? ఎందుకు బెదిరిస్తున్నాడు? అతడ్ని ఫర్హానా ఎలా ఎదుర్కొంది? ఆ వేధింపుల నుంచి ఫర్హానా ఎలా బయటపడింది అనేదే మిగతా కథ. ఆద్యంతం థ్రిల్లింగ్​గా అనిపిస్తుంది ఈ మూవీ. ఐశ్వర్య రాజేశ్, కె. సెల్వ రాఘవన్ బెస్ట్​ పర్ఫార్మెన్స్​ ఇచ్చారు. డైరెక్షన్, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

టైటిల్: ఫర్హానా
డైరెక్షన్: నెల్సన్ వెంకటేశన్
కాస్ట్ : ఐశ్వర్య రాజేష్, కే. సెల్వ రాఘవన్, ఐశ్వర్య దత్తా, అనుమోల్ కె. మనోహరన్, జితాన్ రమేష్.
లాంగ్వేజ్: తమిళం, తెలుగు, హిందీ
ఫ్లాట్ ఫాం: సోనీ లివ్