యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేశా : ఫరియా అబ్దుల్లా

యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేశా : ఫరియా అబ్దుల్లా

తొలిచిత్రం ‘జాతిరత్నాలు’తో సక్సెస్ అందుకున్న ఫరియా అబ్దుల్లా.. వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది. ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన ఆమె ఇప్పుడు యాక్షన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.  శ్రీసింహ కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ‘మత్తు వదలరా2’ చిత్రంలో ఫరియా ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా చెప్పిన విశేషాలు.

‘‘ఇదొక థ్రిల్లర్ మూవీ.  ట్రాజిడీ సీన్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. మత్తు వదలరా పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తారు. వారికి హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రలో నేను నటించా. ఇందులో నా క్యారెక్టర్ పేరు నిధి. యాక్షన్ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కనిపిస్తా.  గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశా.  శ్రీసింహ, సత్యలది సక్సెస్​ఫుల్ కాంబినేషన్. అయినా నేను అందరితో కలసిపోతాను. వాళ్ళ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నా క్యారెక్టర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కాస్త స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. 

అలాగే ఓ పాటకు లిరిక్స్ రాసి, పాడడంతో పాటు కొరియోగ్రఫీ కూడా చేయడం హ్యాపీగా అనిపించింది.  రితేష్ రానా చాలా క్లారిటీ  ఉన్న డైరెక్టర్. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే సాంగ్ కొలాబరేషన్ సాధ్యపడింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. సునీల్, వెన్నెల కిషోర్, రోహిణి లాంటి సీనియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడం హ్యాపీ.  వారి పాత్రలు ప్రేక్షకులని చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తాయి. కాల భైరవ మ్యూజిక్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం తిరువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా. అలాగే ఒక తమిళ చిత్రం షూటింగ్ మొదలవబోతోంది’’.