ఫాంహౌస్ కేసు: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఫాంహౌస్ కేసు: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఫాం హౌస్ కేసుకు సంబంధించి జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. దీంతో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం రేపు విచారణ జరపనుంది. నిందితుల పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తామైతే ఎప్పుడో బెయిల్ ఇచ్చేవారమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఫాం హౌస్​ కేసులో అరెస్టైన రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు గతంలోనూ బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు, సాక్ష్యులను ప్రభావితంచేసే అవకాశముందని పోలీసులు వాదించారు. దీంతో ఏసీబీ కోర్టు వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.