కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే విత్తన చట్టం..కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న రైతు సంఘాల నేతలు

కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే  విత్తన చట్టం..కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న రైతు సంఘాల నేతలు

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకే కేం ద్ర సర్కారు విత్తన ముసాయిదా చట్టాన్ని రూపొందించిందని రైతు సం ఘాల నేతలు విమర్శించారు. ఈ ము సాయిదా చట్టంలో రైతు అనుకూల అంశాలను పొందుపరచాలని డిమాండ్ చేశారు. 

గురువారం హకా భవన్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విత్తన చట్టం–2025 ముసాయిదాపై చర్చించారు. రాష్ట్ర విత్తన కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రైతుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వేష్​రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన చట్టంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.