భువనగిరిలో భూమి కోసం రైతన్న ఆత్మహత్యాయత్నం

భువనగిరిలో భూమి కోసం రైతన్న ఆత్మహత్యాయత్నం

భువనగిరి కలెక్టరేట్ లో ఓ ఘటన కలకలం రేపింది. అధికారులు తమ భూమికి పాసు పుస్తకం ఇవ్వడం లేదని.. ఉప్పలయ్య, అతడి కుమారుడు మహేష్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అధికారులు అప్రమత్తమై వారిని కాపాడారు. బాధితుల చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.కలెక్టర్ ఛాంబర్లో బుడిగే మహేష్, ఆయన తండ్రి ఉప్పలయ్య అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆలేరు మండలం కొలనుపాకలో 4 ఎకరాల భూమిని ఉప్పలయ్య ఆరు వేల రూపాయలకు 20సంవత్సల క్రితం కొనుగోలు చేశాడే. అయితే ఇప్పటివరకు భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కలెక్టరేట్ వద్దకు వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకున్న రైతు.....ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న అధికారులు సిబ్బంది ఉప్పలయ్యను అడ్డుకున్నారు. బాధితుడితో జేసీ మాట్లాడుతున్నారు.ఇన్నేళ్ళుగా కబ్జాలో ఉన్న తనకు చెందిన భూమి పట్టా ఇవ్వకపోవడంతో ఈ అఘాయిత్యానికి యత్నించినట్లు సమాచారం. 20 ఏళ్లుగా ఆఫీసులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టా ఇవ్వడం లేదని బాధితుడు వాపోతున్నాడు.