మాజీ ఎంపీటీసీపై దాడి హేయమైన చర్య : మాజీ ఎమ్మెల్యే రాజయ్య

 మాజీ ఎంపీటీసీపై దాడి హేయమైన చర్య :  మాజీ ఎమ్మెల్యే రాజయ్య
  • డీసీపీ సలీమాకు వినతిపత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

ధర్మసాగర్(వేలేరు), వెలుగు:  వేలేరు మాజీ ఎంపీటీసీ బత్తుల జ్యోతిపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిరసన వ్యక్తం చేశారు.  గురువారం హన్మకొండ డిప్యూటీ కమిషనర్ సలీమాను కలిసి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య డీసీపీ సలీమాతో మాట్లాడారు.  మహిళ అని చూడకుండా ఇష్టారీతిన దాడి చేశారన్నారు. పోలీసుల దగ్గరకు వెళ్లినా, ఎస్సై, సీఐలు సరిగా స్పందించలేదు. సంఘటన వివరాలు తెలుసుకున్న కమిషనర్ సలీమా, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తానని అని హామీ ఇచ్చారు.