గ్రేటర్వరంగల్, వెలుగు: జాతీయ చేనేత దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం సిటీలోని గోపాలస్వామి గుడి సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీవిగ్రహానికి, చేనేత మగ్గం ప్రతిమకి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు ప్రారంభించారు. అనంతరం నేత కార్మికులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, పద్మశాలీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేనేత వస్త్రాలను ధరించాలి
జనగామ అర్బన్, వెలుగు : చేనేత వస్త్రాలను ధరిస్తూ ప్రాధాన్యతను చాటాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం మున్సిపల్ ఆఫీస్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు చౌడేశ్వరి, జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
