త్వరలో కోహెడ కొత్త మార్కెట్ నిర్మాణం: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

త్వరలో కోహెడ కొత్త మార్కెట్ నిర్మాణం: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతులు తీసుకొచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా బాటసింగారం పండ్ల మార్కెట్‌‌‌‌ను సందర్శించి, బత్తాయి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, బత్తాయి ధరల విషయంలో రైతులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పనితీరు బాగుందని, కోహెడలో కొత్త మార్కెట్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు భూమి సునీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ బాస్కర చారి, అధికారులు పాల్గొన్నారు.