గొర్రెను కాపాడేందుకు వెళ్లి.. నీటిలో మునిగి రైతు మృతి

గొర్రెను కాపాడేందుకు వెళ్లి.. నీటిలో మునిగి రైతు మృతి

నెక్కొండ, వెలుగు : గొర్రెను కాపాడేందుకు కాల్వలోకి దూకిన రైతు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన వరంగల్‌‌ జిల్లా నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. ఎస్సై మహేందర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ధరావత్‌‌ స్వామి (35) గురువారం పొలం వద్ద పనులు ముగించుకొని, గొర్రెలను తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ గొర్రె ఎస్సారెస్పీ కాల్వలో పడిపోయింది. దీంతో గొర్రెను కాపాడేందుకు స్వామి నీటిలో దూకాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కాల్వలో మునిగి చనిపోయాడు. మృతుడి బంధువు దేవసింగ్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.