
తొర్రూరు, వెలుగు: విద్యుత్ షాక్ తో రైతు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన రైతు తల్లారి వీరయ్య(58) గురువారం పశువుల కోసం వ్యవసాయ బావి వద్ద గడ్డి కోస్తున్నాడు. విద్యుత్ తీగకు కొడవలి తగలడంతో కరెంట్ షాక్ తో వీరయ్య స్పాట్ లో చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిరుపేద రైతు వీరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.