లక్ష్మణచాంద, వెలుగు: దగ్ధమవుతున్న వరిపంటను కాపాడుకోబోయి ఓ రైతు మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన మంద గంగన్న(56) మంగళవారం ఉదయం తన పంటచేనులో ఉన్న వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు.
మంటలు తీవ్రంగా వ్యాపించి పక్కనే ఉన్న వరి పంట వైపు వెళ్లాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించే క్రమంలో గంగన్న మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు ఆయనకు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
