ధాన్యం కొనుగోలులో గొడవ.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు

 ధాన్యం కొనుగోలులో గొడవ.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు

వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల మధ్య మాట మాట పెరిగి ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో గొడవ పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన మానుపాటి సమ్మయ్య అనే రైతు గత పది రోజుల క్రితం వరి ధాన్యాన్ని అమ్మడానికి మార్కెట్ కు తీసుకువచ్చాడు. వ్యవసాయ అధికారులు చెప్పిన ప్రకారంగా నాణ్యత ప్రమాణాలు పాటించి, వడ్లను శుభ్రం చేసి కొనుగోలుకు సిద్ధంగా ఉంచాడు ఆ రైతు. 

అయితే కొంతమంది రైతులు ముందుగా తమ వడ్లనే కొనుగోలు చేయాలని మార్కెట్ సెంటర్ నిర్వాహకులతో గొడవ దిగారు. దీంతో వారికి నిర్వాహకులు ఆ రైతుల ధాన్యం కొనేందుకు కోనే సంచులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతు సమ్మయ్య మనస్థాపానికి గురై కొనుగోలు కేంద్రం సమీపంలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన స్థానికులు నీటిని తీసుకొచ్చి ఒంటిపై పోశారు. ఈ ఘటనతో అప్పటి వరకు గొడవకు దిగిన తోటి రైతులు సైలెంట్ అయ్యారు. వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు సెంటర్ నిర్వాహకులు సంచులు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.