18 నుంచి 60 ఏళ్ల రైతులకు రైతు బీమా

18 నుంచి 60 ఏళ్ల రైతులకు రైతు బీమా

రాష్ట్రంలో  రైతులెవరైనా ఏ కారణంతో చనిపోయినా.. ఆ కుటుంబానికి వెంటనే రూ.5 లక్షల ను బీమా మొత్తం అందే విధంగా ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ …18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతీ రైతుకు బీమా సదుపాయాన్ని వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. రైతుల పై ఒక్క పైసా కూడా భారం పడకుండా…ప్రతీ రైతు పేరుతో 2,271.50 రూపాయల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే LIC సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తుందని తెలిపారు. రైతు చనిపోతే…పది రోజుల్లోనే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా మొత్తం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతు బీమా కోసం ఈ బడ్జెట్ లో 1,141 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు మంత్రి హరీష్ రావు.