రాజన్న సిరిసిల్ల,వెలుగు : నీవు చనిపోయాక లోన్ మంజూరు చేశాం. నీకు రుణమాఫీ చేయలేం అని బ్యాంకు నుంచి మెసేజ్ రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి దేవేందర్ అనే రైతు 2018లో కేడీసీసీ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడు. రూ.84 వేలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మిత్తి కూడా చెల్లించాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా దేవేందర్ రుణమాఫీ కోసం ఎల్లారెడ్డిపేట కేడీసీసీ బ్యాంకుకు వెళ్తే బ్యాంకు వారు ‘‘నీవు మరణించాక లోన్ సాంక్షన్ అయింది.
నీకు రుణమాఫీ వర్తించదు’’ అని చెప్పడంతో దేవేందర్ అవాక్కయ్యాడు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ నుంచి తాను బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.