వానకాలం సీజనొచ్చినా.. యాసంగి పైసలు రాలె

వానకాలం సీజనొచ్చినా.. యాసంగి పైసలు రాలె
  • ట్రక్ షీట్లతో రైతులను ముంచుతున్న మిల్లర్లు
  • దుక్కి సిద్ధం చేసేందుకు డబ్బులు కరువు
  • అప్పుల బాధలో రైతులు ఎన్కకు పోతున్న సీజన్

హైదరాబాద్, వెలుగు: వానకాలం పంట సీజన్ మొదలైనా.. యాసంగి వడ్ల పైసలు ఇంకా చేతికిరాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంటాపెట్టి నెల గడిచినా పైసలు ఇంకా రాలేదు. వేల మంది రైతులకు ఇప్పటికీ కనీసం ట్రక్ షీట్లు ఇవ్వలేదు. దీంతో రోజూ మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. యాసంగి సాగు కోసం ఎరువుల దుకాణంలో, ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్ దగ్గర పెట్టిన బాకీలు కట్టలేక లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో దుక్కులు దున్నుడు వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు స్కూళ్లు స్టార్ట్ అవుతుండడంతో పిల్లల చదువులకు పైసలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నరు.

 ట్రక్ షీట్లతో దోపిడీ

ట్రక్ షీట్లను అడ్డం పెట్టుకుని మిల్లర్లు రైతులపై జులుం చేస్తున్నారు. కాంటా అయిన వడ్లు మిల్లుకు వెళ్లి, మిల్లర్ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకున్న వెంటనే రైతులకు ట్రక్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. ఈ ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్​వ్యవహారమే రైతుల కొంప ముంచుతున్నది. అప్పుల బాధతో మార్కెట్ యార్డుకు వెళ్తున్న రైతులను మభ్యపెట్టి క్వింటాళ్ల కొద్ది కోతకు ఒప్పిస్తున్నారు. ఈ అనధికార కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మిల్లర్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభ పడుతుండగా, మిల్లర్ ఇచ్చే మాముళ్లతో మార్కెట్ల నిర్వాహకులు, సివిల్ సప్లైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు జేబులు నింపుకుంటున్నారు. కాంటా పెట్టిన వెంటనే, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రైతులకు ట్రక్ షీట్లు ఇస్తే ఈ దోపిడీకి చెక్ పెట్టే అవకాశం ఉన్నా.. సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

మాటల్లో ముంగటికి.. చేతల్లో ఎన్కకు

ప్రతి యాసంగి సీజన్ చివర్లో అకాల వర్షాలు పడి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఈసారీ ఆగమయ్యారు. ఈ కారణంతో పంట సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు జరుపుతామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. ఆచరణలో మాత్రం సీజన్ ఆలస్యమయ్యేలా సర్కార్ చర్యలు కనిపిస్తున్నయి. యాసంగి వడ్ల కొనుగోళ్లను ఆలస్యంగా ప్రారంభించిన సర్కార్.. రైతులకు డబ్బులు చెల్లించడంలో మరింత ఆలస్యం చేస్తోంది. ఇప్పటికీ  లక్షల టన్నుల వడ్లు మార్కెట్ యార్డులు, కల్లాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ కాంటా అయ్యి, రైతులకు డబ్బు అందడానికి కనీసం ఇంకో నెల రోజులు పట్టేలా ఉంది.

నెల రోజులైతున్నా ట్రక్ షీట్లు ఇయ్యలే

ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డులో వడ్లు పోసిన. పోయిన నెల 16న కాంటా అయినా.. ఇప్పటికీ ట్రక్ షీట్లు ఇయ్యలే. బ్యాంక్ పాస్ బుక్, భూమి కాగితాలు తీసుకోలేదు. అప్పుల బాధకు కొందరు ఒకటికి రెండుసార్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోతే, మిల్లర్ దగ్గరికి తీసుకుపోయి వడ్ల కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్లు ఇస్తమని, పైసలు జల్ది వస్తయని మభ్య పెడుతున్నారు. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కటింగ్ పెడుతున్నరు.  - డేగ ఓదెలు, మంథని, పెద్దపల్లి జిల్లా

తొందరగా ఇయ్యాలె

నెల కిందట అన్నారం బ్రిడ్జి పీఏసీఎస్ లో 200 బస్తాలు వడ్లు అమ్మినం. పైసలు ఇప్పటి వరకు పడలేదు. అడిగితే రేపు, మాపు అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రభుత్వం వడ్ల పైసలు తొందరగా వెయ్యాలి. - నుకాల మాధవ రెడ్డి, పోట్లపాడు, పెన్ పహాడ్, సూర్యాపేట జిల్లా

సాగుకు పైసలు లేవు

తుంగతుర్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వడ్లు కాంటా పెట్టి 25 రోజులు దాటింది. నేటికీ డబ్బులు పడలేదు. మరోవైపు వర్షాలు పడుతున్నయి. ఈ వానకాలం సీజన్ కు పని చేసుకోవడానికి డబ్బులు లేవు. ట్రాక్టర్  కిస్తీ కట్టాలి. పిల్లల చదువులకు, విత్తనం వడ్లు, పిండి బస్తాలకు పైసలు కావాలి. - ఉప్పుల సోమయ్య, రైతు, తుంగతుర్తి