హైదరాబాద్ సిటీ, వెలుగు: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని భారతి నగర్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన రైతు బజార్‌ను, బాంబే కాలనీలో రూ.2.47 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను శనివారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
అనంతరం ఎంఐజీ ప్రాంతంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. రైతు బజార్‌లో నాలుగు కేటగిరీల షెడ్‌లు ఉండగా, ఒక్కో షెడ్‌లో 26 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం విక్రయాల కోసం వేర్వేరు షెడ్‌లు కేటాయించామన్నారు.
