ఆసిఫా బాద్ జిల్లాలో పోడు రీ ట్రైవ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్న రైతులు

ఆసిఫా బాద్ జిల్లాలో పోడు రీ ట్రైవ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్న రైతులు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా ఖర్జెల్లి ఫారెస్ట్ బీట్‌‌‌‌‌‌‌‌లో శనివారం చేపట్టిన పోడు భూమి రీ ట్రైవ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఖర్జెల్లి బీట్‌‌‌‌‌‌‌‌లోని 185 కంపార్ట్మెంట్‌‌‌‌‌‌‌‌లో 174 ఎకరాలు ఆక్రమణకు గురైందని గుర్తించిన ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు అందులోని 74 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. రైతులు అడ్డగించడంతో శనివారం మరోసారి పొడు భూముల్లో ప్రొక్లెయిన్‌‌‌‌‌‌‌‌తో ట్రెంచ్ తవ్వకం చేపట్టారు. 

గమనించిన రైతులు ఒక్కసారిగా పనులు చేస్తున్న చోటుకు చేరుకొని పనులను అడ్డుకొని బైఠాయించారు. దీంతో రైతులు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్ఐ జీవన్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఎఫ్ఆర్ఓ సుభాష్ తో ఫోన్లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వే చేయిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.