పునరావాసం ప్యాకేజీ అందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి : సాకిబండ తండా రైతులు

పునరావాసం ప్యాకేజీ అందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి : సాకిబండ తండా  రైతులు

ఆమనగల్లు, వెలుగు : గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమనగల్లు మండలం సాకిబండ తండా బాధిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సేకరించిన భూమికి ఎకరాకు కోటి రూపాయలు, ఫ్యూచర్ సిటీలో 500 గజాల నివాస స్థలం ఇవ్వాలన్నారు. దీర్ఘకాలిక జీవనోపాధి భద్రత, గృహ స్థిరత్వం, సామాజిక రక్షణకు భరోసా కల్పించాలని చెప్పారు. తమ డిమాండ్లకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.