రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ చందుర్తి మండలంలో రైతులు నిరసనకు దిగారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీనిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ స్పందించారు. రైతులెవరు అదైర్య పడొద్దన్నారు.  తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు బీజేపీ నేతలు. 

మరోవైపు తంగళ్లపల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు సెంటర్లకు లారీలు రావడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు పెట్టి ఇన్ని రోజులవుతున్నా లారీలు రావడం లేదంటూ రైతులు ఫైర్ అవుతున్నారు. వెంటనే లారీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మండేపల్లి, రాళ్లపేటకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు.