
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. జొన్నలు కాంటా పెట్టి పది రోజులవుతున్నా ఇంకా తరలించడం లేదంటూ ఆందోళనకు దిగారు. పనులన్నీ వదులుకొని మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలను తెప్పించి పంటను తరలించాలని డిమాండ్ చేశారు. పంట తరలించే వరకు రైతులదే బాధ్యత అంటూ అధికారులు చెప్పారు. దీంతో లారీలు వచ్చే వరకు వారు పడిగాపులు కాస్తున్నారు. అసలే వర్షాకాలమని జొన్నలు తడిసిపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.