
- వచ్చిన వారిలో గులాబీ లీడర్లే ఎక్కువ
- అగ్రికల్చర్ఆఫీసర్లపై ఎమ్మెల్యేల ఫైర్
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలు రైతులు లేక వెలవెలపోయాయి. ఒక్కో రైతు వేదికలో కనీసం వెయ్యి మందితో వేడుకలు జరపాలని అనుకున్నప్పటికీ అంతటా వంద నుంచి రెండు వందల లోపే హాజరయ్యారు. వచ్చిన వాళ్లలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది కనిపించారు. కొన్నిచోట్ల రైతులు రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు సమస్యలపై మాట్లాడగా ఎమ్మెల్యేలు, అధికారులు జోక్యం చేసుకొని టాపిక్ డైవర్ట్చేశారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరానికి రూ.పదివేల చొప్పున రైతుబంధు, రైతు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ గురించి రైతులు మాట్లాడకపోవడంతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు.
ఇంట్రస్ట్ చూపని రైతులు....
జిల్లాలోని 55 రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఏడెనిమిది గ్రామాలు ఉండగా, ప్రతి ఊరి నుంచి కనీసం వంద మందిని సమీకరించే పనిని అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పగించారు. మూడు నాలుగు రోజుల నుంచి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు రైతులను మోటివేట్చేసినప్పటికీ పెద్దగా ఇంట్రస్ట్చూపలేదు. కాంటా వేసిన తర్వాత 48 గంటల్లో అకౌంట్లలో జమ చేస్తామన్న పైసలు ఇరవై రోజులైనా అందకపోవడంతో సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. నిరుడు వానకాలంలో, మొన్నటి అకాల వర్షాలతో వివిధ పంటలు నష్టపోయినా ప్రభుత్వం పైసా పరిహారం ఇవ్వలేదు. ఐదేండ్లు కావస్తున్నా రూ.లక్ష రుణమాఫీ పూర్తి కాలేదు.
అధికారులపై ఎమ్మెల్యేల అసహనం....
ప్రభుత్వం ఎంతో హడావుడి చేసినప్పటీ రైతు దినోత్సవానికి రైతుల నుంచి స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యేలు బిత్తరపోయారు. ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నమెంట్‌కు నెగిటివ్రిపోర్టు అందితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన కనిపించింది. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు హాజరుకాగా, చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్ గైర్హాజరయ్యారు. జన్నారం మండలం పొన్కల్‌లో రైతులు పెద్దగా లేకపోవడంతో ఎమ్మెల్యే రేఖానాయక్అగ్రికల్చర్ అధికారులను మందలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కార్యక్రమానికి రైతులను సమీకరించడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఈ విషయమై ఆమె ఫోన్లో కలెక్టర్‌కు కంప్లయింట్చేసినట్టు సమాచారం. అలాగే బెల్లంపల్లి మండలం కన్నాల, గురిజాలలో రైతులు తక్కువ సంఖ్యలో హాజరవడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆఫీసర్లపై అసహనం వ్యక్తం చేశారు.
సక్సెస్ చేశాం : డీఏవో కల్పన....
జిల్లాలోని 55 రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని నిర్వహించాం. రైతులను పెద్ద సంఖ్యలో తరలించి ప్రోగ్రాంను సక్సెస్చేశాం. ప్రతి చోటా వెయ్యి మందికి వెజ్, నాజ్వెజ్భోజనాలు ఏర్పాటు చేశాం. పొన్కల్‌లో ఎమ్మెల్యే మేడం ముందుగా రావడంతో అప్పటికీ రైతులు అందరూ రాలేదు. అన్ని చోట్ల పండుగ వాతావరణంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించాం.