దొడ్డు, సన్న ధాన్యానికి వేర్వేరుగా కౌంటర్లు ..వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

దొడ్డు, సన్న ధాన్యానికి వేర్వేరుగా కౌంటర్లు ..వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

 వికారాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో ఆయన మాట్లాడారు.

 కరెంటు, నీటి వసతి, కుర్చీలు, టెంట్ ఏర్పూఆటు చేయాలన్నారు. కేంద్రం పేరు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబర్ తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కౌంటర్లు ఉండాలన్నారు. ఏ గ్రేడ్ కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎస్​వో సుదర్శన్, డీఎంసీఎస్​ మోహన్ కృష్ణ, డీఏవో రాజారత్నం పాల్గొన్నారు.