జోగులాంబ గద్వాల జిల్లాలో స్టేషన్ కు చేరిన పందుల బెడద

 జోగులాంబ గద్వాల జిల్లాలో స్టేషన్ కు చేరిన పందుల బెడద
  • పంటలను నాశనం చేస్తున్నాయని బాధిత రైతుల ఫిర్యాదు 

అలంపూర్,వెలుగు: పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కర్నూలుకు చెందిన కొందరు పందులను తెలంగాణలోని ఉండవెల్లి మండలం పుల్లూరు శివారులోని టోల్ ప్లాజా వద్ద వదిలివెళ్లారు. 

పందులు అక్కడి హోటళ్లలోని  వ్యర్థాలను తినడంతో పాటు సమీపంలోని  సుమారు 50 ఎకరాల్లో పంటలను నష్టపరిచాయి. దీంతో బాధిత రైతులు ఆదివారం ఉండవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శేఖర్ వెళ్లి పంట లను పరిశీలించారు. పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్, ఏసన్న, గోపీ, భాస్కర్, అన్వర్ బాష , శేషన్ననాయుడు కోరారు.