ధాన్యం డబ్బులు వాడుకున్నరని రైతుల ఆందోళన

ధాన్యం డబ్బులు వాడుకున్నరని రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోళ్లు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదని నిజామాబాద్ సహకార సంఘం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సీఈవో రాజు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ తమ ధాన్యం డబ్బులు వాడూకున్నారని ఆరోపించారు. రాజుపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ కి వినతి పత్రం ఇచ్చారు. 

అయితే గతంలోనూ ఆరోపణలు రావడంతో  ఈ సారి రాజుని సస్పెండ్ చేసామని సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి చెప్పారు. ఆయన తీరు మారలేదన్నారు. సొసైటీ సీఈఓ రాజుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఈ నెల 8న ఫిర్యాదు చేశామని రవీందర్ రెడ్డి చెప్పారు.