
జనగామ అర్బన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ భాషా షేక్అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్ తో కలిసి ప్రజల వద్ద నుంచి 58 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 11 వరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో మహిళా సమాఖ్య సమావేశాలు నిర్వహించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జీపీఎస్ సిస్థం ద్వారా నేరుగా లబ్ధిదారుడికే ఇసుక అందజేయాలని ఆదేశించారు. స్కూల్, అంగన్వాడీ, పీహెచ్‌సీల్లో విస్తృతంగా మొక్కలు నాటించాలన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి సీజనల్‌వ్యాధులను అరికట్టేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీవో గోపీరాం, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత్ నాయక్, డీఆర్డీవో వసంత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలి
జనగామ అర్బన్, వెలుగు: టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్అభియాన్తో పాటు ఎన్సీడీ ప్రోగ్రాం అమలు తీరును డీఎంహెచ్‌వో డాక్టర్మల్లిఖార్జున్రావుతో కలిసి పీహెచ్సీ, సబ్‌సెంటర్లు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో సోమవారం కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. జిల్లాను టీబీ రహిత సమాజంగా మార్చేందుకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లను పరిశీలిస్తూ అనుమానితులకు పరీక్షలు నిర్వహించి టీబీ కేసులను గుర్తించాలన్నారు. అవసరమున్న చోట క్యాంపులు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. నిరుపేదలకు కార్పొరేట్‌స్థాయిలో వైద్య సదుపాయాలు అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలతో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా జరగాలని కలెక్టర్సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా సమైక్య సమావేశానికి అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్తో కలిసి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ నెల 10 నుంచి 16 వరకు జరిగే సంబరాల్లో కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.