
షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘డాన్’ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు మూడో సినిమా సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈసారి రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. గత కొన్నినెలలుగా దర్శకుడు పర్హాన్ అక్తర్ ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాడు.
నిజానికి గత ఏడాదే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ షారుఖ్ స్థానంలో రణవీర్ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శల వేడి చల్లారడంతో పాటు డాన్ క్యారెక్టర్ కోసం ఫిజికల్‌గా రణవీర్ ప్రిపేర్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నారు.
అలాగే హీరోయిన్‌గా కియారా అద్వానిని ఎంపిక చేయగా.. తన ప్రెగ్నెన్సీ కారణంగా కుదరలేదు. తిరిగి ఇప్పుడు ఆమెనే హీరోయిన్‌గా నటించబోతోంది. ఇక అభిమానులను సంతృప్తి పరిచేందుకు షారుఖ్ ఖాన్‌తో ఓ అతిథి పాత్ర చేయించాలనే ప్లాన్‌లో ఉన్నాడు దర్శకుడు.
ALSO READ : పూరి-సేతుపతి మూవీ.. హైదరాబాద్‌లో షూటింగ్ షురూ
అంతేకాదు గత రెండు ‘డాన్’ చిత్రాల్లో స్పెషల్ ఏజెంట్ రోమాగా నటించిన ప్రియాంకను కూడా ఈ సినిమాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత మళ్లీ షారుఖ్‌తో కలిసి కనిపించబోతోంది ప్రియాంక.
మొత్తానికి అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ‘డాన్ 3’షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌తో పాటు మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రియాంక నటిస్తోంది.
🚨 #Don3 is BACK, and it’s bringing the HEAT! 🔥
— Bollywood Base (@Bollywood_Base) July 7, 2025
Ranveer Singh’s ready to rule as the ultimate Don, with shooting kicking off in 2026 after some spicy delays.
Directed by Farhan Akhtar, the film faced delays due to online trolling, Kiara Advani’s pregnancy, and Farhan’s… pic.twitter.com/l956cg7qKF