
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో నటిస్తున్న నటీనటులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్‌లో టీమ్ అంతా కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
AND IT BEGINS 💥💥💥
— Puri Connects (@PuriConnects) July 7, 2025
The raw and real journey of #PuriSethupathi begins on the sets today in Hyderabad ❤️🔥
Major talkie portions featuring Makkalselvan @VijaySethuOffl and fierce @iamsamyuktha_ are being canned in this packed schedule and will have a continuous shoot🔥
A… pic.twitter.com/O0946z7rgh
సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
The much anticipated journey of #PuriSethupathi begins with a divine pooja ceremony✨
— Puri Connects (@PuriConnects) June 30, 2025
Makkalselvan @VijaySethuOffl and Dashing Director #PuriJagannadh are gearing up to deliver a memorable film ❤🔥
Regular shoot begins in July 1st week 💥
Produced by Puri Jagannadh, Charmme… pic.twitter.com/530ZVX6FXZ