
కరీంనగర్ టౌన్,వెలుగు: గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో 265 దరఖాస్తులను స్వీకరించారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం 151 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. బోయినిపల్లి మండలం స్తంభంపల్లి వద్ద గంజి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి, పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 39 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత పేర్కొన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ ఆఫీస్‌లో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ అశోక్‌కుమార్ 11 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.