
నిజామాబాద్ : పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామంలో నిరసన తెలిపారు. పట్టాల గురించి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని… గ్రామ VROను పంచాయతీ గదిలో బంధించారు. పట్టాపుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలేవి తమకు అందడం లేదని వాపోయారు గ్రామరైతులు. జిల్లా కలెక్టర్ కు, స్థానిక తహశీల్దార్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. అందుకే ఇలా కఠినంగా వ్యవహరించామని తమ భూముల పట్టా దారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.