మారుతీ డిస్కౌంట్ ఆఫర్.. బాలెనో కార్లపై రూ.లక్ష 10వేలు తగ్గింపు.. వివరాలివే

మారుతీ డిస్కౌంట్ ఆఫర్.. బాలెనో కార్లపై రూ.లక్ష 10వేలు తగ్గింపు.. వివరాలివే

దేశంలో ప్రస్తుతం ఆటో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునే పనిలో ఉన్నాయి. చైనా నుంచి కొన్ని ముఖ్యమైన మెటీరియల్స్ షార్టేజీతో ఇబ్బంది పడుతున్న భారత ఆటో రంగం దానిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈక్రమంలోనే పండుగలకు మునుపే కార్ కంపెనీలు ఆకర్షనీయమైన తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. 

తాజాగా మారుతీ సుజుకీ ఇండియా జూలైలో తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై రూ.లక్ష10 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.45,000 నగదు తగ్గింపు ఉంది. కంపెనీ బాలెనో పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై ఈ తగ్గింపును అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6లక్షల 70 వేలుగా ఉంది. పైగా ఈ మోడల్ దేశంలో అమ్ముడైన కార్లలో టాప్ టెన్ స్థానంలో కొనసాగుతోంది.

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 360 డిగ్రీస్ కెమెరా.. 9 -అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తోంది. బాలెనోలో 1.2-లీటర్, నాలుగు సిలిండర్ల K12N పెట్రోల్ ఇంజన్ ఉంది. 

ALSO READ : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ధమాకా.. ఐఫోన్ పై కళ్ళు చెదిరే అఫర్ ఇంకా మరెన్నో

భద్రత విషయానికి వస్తే.. మారుతి బాలెనో 6 ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, 360- డిగ్రీ కెమెరా, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్, రివర్సింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. అయితే ఆఫర్ పూర్తి వివరాల కోసం మీ నగరంలోని మారుతీ డీలర్లను వెంటనే సంప్రదించి తెలుసుకోండి.