ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే కలెక్టర్ స్పందించకపోవడంతో నేషనల్ హైవే దిగ్బందానికి రైతులు బయలుదేరగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును క్లోజ్ చేశారు.