రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ నేతలకు రైతుల నిరసన సెగ

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ నేతలకు రైతుల నిరసన సెగ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులకు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 2వ తేదీ పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ గేటుకు తాళం వేసి గేటు ముందు నిరసన తెలిపారు రైతులు. తెలంగాణ దినోత్సవం పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరణకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్, సింగల్ విండో చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీల తోపాటు నాయకులను అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు.అయితే రైతులను దాటుకుకుంటూ వెళ్లి మార్కెట్ యార్డ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రజాప్రతినిధులు.

ఈ క్రమంలో మార్కెట్ యార్డ్ లోపల ప్రజాప్రతినిధులు ఉండగా.. బయట గేట్ వేసి రైతుల నిరసన తెలిపారు. రైతుల ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీశారు రైతులు. మంథని మండలం భట్టుపల్లిలో మంథని–కాటారం ప్రధాన రహదారిపై వడ్లు పోసి రైతుల ఆందోళన చేపట్టారు.