
ఏపీలోని కృష్ణా జిల్లాలో యూరియా కొరత ఏర్పడటంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ( పిఎసిఎస్ ) గోడౌన్ల దగ్గర ఆందోళనకు దిగారు రైతులు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని.. పూర్తిస్థాయిలో యూరియాను అందించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు రైతులు. అవసరం మేరకు యూరియా సరఫరా రాలేదంటూ రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎకరాకు అరికట్ట మాత్రమే యూరియా అందించడంతో ముదునూరు పిఎసిఎస్ గోడౌన్ దగ్గర ఆందోళనకు దిగారు రైతులు.
పూర్తిస్థాయిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు రైతులు. దీనిపై స్పందించిన పిఎసిఎస్ సీఈఓ భరత్ రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 170 టన్నుల యూరియా రావాల్సి ఉందని.. 70 తన్నులు మాత్రమే వచ్చిందని అన్నారు. కొంతమందికి మంత్రమే యూరియా అందిందని.. మరికొంతమందికి అందకపోవడంతో నిరసన దిగారు రైతులు.
ఎరువుల కోసం సొసైటీకి వెళ్తే పాస్ పుస్తకం, గుర్తింపు కార్డు అడుగుతున్నారని.. తమకు గుర్తింపు కార్డు ఇవ్వనందున ఎక్కడ నుంచి తెస్తామని ప్రశ్నిస్తున్నారు రైతులు. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.