యూరియా కోసం ఎస్సై కాళ్లు మొక్కిన రైతు

యూరియా కోసం ఎస్సై కాళ్లు మొక్కిన రైతు

పరిగి, వెలుగు: యూరియా కోసం ఓ రైతు ఎస్సై కాళ్లు మొక్కారు. యూరియా కోసం కొన్ని రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో గురువారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. 

అదే సమయంలో పరిగి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. కుల్కచర్ల ఎస్సై రమేశ్​కుమార్​ అక్కడకు రాగా.. ఓ రైతు ఆయన కాళ్లపై పడ్డాడు. యూరియా బస్తా ఇప్పించండి సారూ అని వేడుకున్నాడు.