యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు చేశారు. ఒక్కో రైతుకు మూడు బస్తాలు మాత్రమే ఇస్తున్నారంటూ పీఏసీఎస్ ముందు రైతులు నిరసనకు దిగారు. అవసరానికి సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు మానేసి ఉదయం నుంచి లైన్ లో నిల్చున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి యూరియా కొరతను తీర్చాలని అభ్యర్థించారు.