రైతుల నిరసనలతో కరోనా హాట్‌స్పాట్‌లుగా గ్రామాలు

రైతుల నిరసనలతో కరోనా హాట్‌స్పాట్‌లుగా గ్రామాలు

చండీగఢ్: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తున్నారు. అయితే ఆందోళనలు చేస్తున్న రైతుల వల్ల తమ రాష్ట్రంలోని పలు గ్రామాలు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారాయని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. 'కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరసనలు ఆపేయాలని నెల రోజుల కింద రైతు సంఘాల నేతలకు కోరా. పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ ఆందోళనలను కొనసాగించొచ్చని చెప్పా. కానీ వారు నా మాటలు వినలేదు. ఇప్పుడు రైతుల నిరసనలతో కొన్ని గ్రామాలు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారడాన్ని చూస్తున్నాం. ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకొని నిరసనలను ఆపేయాలి. మన జీవితాల కంటే ఏదీ ముఖ్యం కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే మన కర్తవ్యం కావాలి' అని ఖట్టర్ పేర్కొన్నారు.