
నిజాంపేట, వెలుగు: మండలంలోని రైతులకు యూరియా కష్టాలు కంటిన్యూ అవుతునే ఉన్నాయి. ఆదివారం మండల పరిధిలోని కల్వకుంట పీఏ సీఎస్ లో యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి రైతులు ఉదయం నుంచే పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డులు వెంట పెట్టుకుని క్యూ లైన్ లో నిల్చున్నారు. రైతులు ఎక్కువ రావడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను మాత్రమే అందించారు. నాలుగైదు రోజులు ఎదురు చూస్తే ఒక లారీ మాత్రమే వచ్చిందని, వచ్చిన యూరియా ఎటూ సరిపోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.