
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు ఇలా క్యూ కట్టారు. గురువారం యూరియా బస్తాలు ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు ఒక్కసారిగా రావడంతో
రద్దీ ఏర్పడింది. దీంతో వ్యవసాయ అధికారులు టోకెన్ సిస్టం ద్వారా యూరియా పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలున్నాయని మండల వ్యవసాయ అధికారి నగేశ్ రెడ్డి తెలిపారు. యూరియా కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని రైతులకు సూచించారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్