- పీఏసీఎస్ వద్దే నిద్రాహారాలు
- క్యూలైన్‌లో చెప్పులు, రాళ్లు, పేపర్లు
నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు : గన్నీ బ్యాగుల కోసం మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నీ బ్యాగులు తీసుకెళ్లేందుకు పీఏసీఎస్ సెంటర్ల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోంది. సుమారు 100 మంది రైతుల ఆదివారం రాత్రే నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడే నిద్రించారు. సోమవారం ఉదయం ఆఫీస్ ఓపెన్ చేయకముందే చెప్పులు, పేపర్లు, రాళ్లు వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూశారు.
కొందరు రైతులు మాట్లాడుతూ... గన్నీ బ్యాగులను ఆఫీసర్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఆఫీస్ వద్ద పడిగాపులు పడుతున్నా బ్యాగులు దొరకడం లేదని వాపోయారు. ఆఫీసర్లు.. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే బ్యాగులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరారు.

