Farmers Protest: రైతుల డిమాండ్లను పరిష్కరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

Farmers Protest: రైతుల డిమాండ్లను పరిష్కరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతులు చేస్తున్న ఆందోళనలో పోలీసులతో ఘర్షణ.. ఓ యువ రైతు చనిపోవడంతో రైతు సంఘాలు తమ ఢిల్లీ ఛలో మార్చ్ ను ఫిబ్రవరి 29 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 వరకు వారం రోజుల పాటు కార్యచరణను ప్రకటించారు రైతు సంఘాల నేతలు. ఫిబ్రవరి 24న క్యాండిల్  మార్చ్, 25న రైతుల సమస్యలపై సదస్సులు, 24న ప్రపంచ వాణిజ్యసంస్థ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తామని ప్రకటించారు. ఎస్ కేఎం ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. 

వారం రోజుల కార్యచరణతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతియుత నిరసనలు చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతూ సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు రైతు సంఘం నేతలు.సిక్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అగ్నో స్టోస్ థియోస్ రైతుల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాక్ స్వేచ్ఛను కాపాడాలని , శాంతియుత నిరసనలకు ఆటంకం కలిగించే ప్రభుత్వ చర్యలపై కేసు నమోదు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 

మరోవైపు ఆందోళన చేస్తున్న రైతులపై భద్రతా చట్టం ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు. దీంతోపాటు పంట రుణాలపై వడ్డీ, పెనాల్టీని మాఫీ చేస్తున్నట్లు  హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. 2024-25 కోసం రూ. 1.89 లక్షల కోట్ల బడ్జెట్ లో పన్నులను పెంచలేదు.14 రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందని ఖట్టర్ స్పష్టం చేశారు.  

పంటలక కనీస మద్దతు ధర చట్టపరమైన హామీతోపాటు రైతు రుణ మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతులకు, రైతు కూలీలకు పింఛను, విద్యుత్ ఛార్జీల పెంపుదల , పోలీసు కేసులను ఎత్తివేయాలని, 2021 లో లఖింపూర్ ఖేరి హింసాకాండ బాధితులకు న్యాయం, భూసేకరణ చట్టం 2013 పునరుద్దరణ, 2020-21 లో మునుపటి ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు.