రైతుల మేలుకే కొత్త విత్తన చట్టం : రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్

రైతుల మేలుకే కొత్త విత్తన చట్టం : రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్

చేవెళ్ల, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసం కొత్తగా విత్తన చట్టం రాబోతోందనిరైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమిసునీల్అన్నారు. లీగల్ ఎంపవర్‌‌మెంట్‌ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ (లీఫ్ సంస్థ) సహాకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో సాగు యాత్రలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మొయినాబాద్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు ఎం.సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

 రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవైతే రైతు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే, నూతన వ్యవసాయ విత్తన చట్టం వస్తే రైతు నష్టపోకుండా ఉండేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. రైతులకు మార్కెట్ చట్టంపై అవగాహన ఉంటే.. మార్కెట్‌లో పంటను అమ్ముకునే సమయంలో మోసపోకుండా ఉంటారని తెలిపారు. నకిలీ విత్తనాలతో నష్టపోతే వినియోగదారుల చట్టం 2019 కింద జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు ఫైల్‌ చేసి, నష్టపరిహారం పొందవచ్చని ఆయన వెల్లడించారు.